![]() |
![]() |

బిగ్ బాస్ ఐపోగానే ఈ కంటెస్టెంట్స్ అందరితో కలిసి బిబి జోడి పేరుతో ఒక డాన్స్ షో తీసుకురావడం ఆనవాయితీగా మారింది. ఆల్రెడీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో బిబి జోడి సీజన్ 1 ఐపోయింది. ఇక త్వరలో బిబి జోడి సీజన్ 2 రాబోతోంది. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో కొన్ని జోడీలను తీసుకొచ్చి ఒక బంగ్లాలో బంధించి "వెల్కమ్ టు ది హౌస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్" అనే వాయిస్ వినిపించింది. తర్వాత అమరదీప్ వచ్చి "మళ్ళీ 100 డేసా" అని అడిగాడు. తర్వాత ప్రదీప్ వచ్చి "కాదు అదిరిపోయే డాన్స్" అన్నాడు. తర్వాత కీర్తి భట్ వచ్చి "సోలోనా" అని అడిగింది.
శేఖర్ మాష్టర్ వచ్చి "కాదు జోడి" అన్నాడు. తర్వాత శ్రీదేవి విజయకుమార్ నవ్వుతూ వచ్చింది. ధన్ రాజ్ - భానుశ్రీ, ఆర్జే చైతు - కీర్తి భట్, విశ్వ - నేహా, మణికంఠ - ప్రియాంక సింగ్, అమరదీప్ - నైనికా, సాయి శ్రీనివాస్ - నయనిపావని, మానస్ - స్రష్టి వర్మ, అఖిల్ సార్థక్ - వాసంతి, శ్రీసత్య - అర్జున్ కళ్యాణ్ జోడీస్ రాబోతున్నారు. "క్లాసైనా, మాస్ ఐనా ఈ స్టేజి దద్దరిల్లిపోవాల్సిందే" అని చెప్పుకొచ్చాడు శేఖర్ మాష్టర్. "ఇది వన్ టైం ఛాన్స్, ఎప్పుడూ చూడని డాన్స్" అంటూ శ్రీదేవి చెప్పింది. "వెల్కమ్ టు ది విశ్వరూపం ఆఫ్ ఎంటర్టైన్మెంట్" అంటూ హోస్ట్ ప్రదీప్ చెప్పాడు.
![]() |
![]() |